దీపావళి పండుగ వేళ పామాయిల్ రైతులకు రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుభవార్త చెప్పారు. నవంబర్ నెల నుంచి పామాయిల్ గెలల ధర రూ. 19 వేలకు పైగా పెరుగుతుందని చెప్పారు. పామాయిల్ పంట వేసిన రైతులు ఆర్థికంగా లాభపడేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. ఈ అవకాశాన్ని పామాయిల్ రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అలాగే, రాష్ట్ర ప్రజలకు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.