ఖమ్మం వీడియోస్ కాలనీలోని ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ లో ఏర్పాటు చేసిన మెగా ఆర్గానిక్ మేళాను శనివారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. ఈనెల 8, 9వ తేదీ రెండు రోజులే మేళా జరుగుతుందన్నారు. సేంద్రియ పద్ధతిలో సాగు చేసి పండించిన కూరగాయలు, పండ్లు, చిరుధాన్యాలు, తదితర స్టాల్స్ ను సందర్శించి మాట్లాడారు. సేంద్రీయ వ్యవసాయ పద్ధతులను అనుసరించి వ్యవసాయాన్ని లాభసాటిగా మలుచుకోవాలని అన్నారు.