ఖమ్మం: మిస్‌ వరల్డ్‌ అందాల పోటీలను రద్దు చేయాలి

77చూసినవారు
ఖమ్మం: మిస్‌ వరల్డ్‌ అందాల పోటీలను రద్దు చేయాలి
హైదరాబాద్‌ వేదికగా మే నెలలో నిర్వహించనున్న 72వ మిస్‌ వరల్డ్‌ అందాల పోటీలను రద్దు చేయాలని పీఓడబ్ల్యూ రాష్ట్ర కార్యదర్శి సీహెచ్. శిరోమణి, ఐద్వా జిల్లా కార్యదర్శి బండి పద్మ, పోటు కళావతి డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఖమ్మం జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్, ఆర్డిఓ నర్సింహారావుకు వినతి పత్రాన్ని అందజేశారు. స్త్రీల ఆత్మగౌరవాన్ని భంగం కల్గించే మిస్ వరల్డ్ పోటీలను ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్