సీపీఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్ అంతిమ యాత్ర శుక్రవారం ఖమ్మం నగరంలో జరిగింది. అంతిమయాత్రలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పాల్గొని పాడే మోశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భాగం హేమంత్ రావు, భద్రాద్రి కొత్తగూడెం సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా, ఉమ్మడి జిల్లా పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.