కామేపల్లి మండల పరిధిలోని తాళ్ళగూడెం గ్రామానికి చెందిన కామేపల్లి సొసైటీ అధ్యక్షులు, ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షులు పుచ్చకాయల వీరభద్రం, వీరనారాయణ మాతృమూర్తి పుచ్చకాయల అచ్చమ్మ ఇటీవల మృతి చెందారు. శనివారం జరిగిన సంస్మరణ సభకు ఇల్లెందు నియోజకవర్గ ఎమ్మెల్యే కోరం కనకయ్య హాజరయ్యారు. తొలుత అచ్చమ్మ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.