ప్రధాని మోదీ పరిపాలనలో అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం చేకూరేలా కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టడాన్ని హర్షిస్తూ ఆ పార్టీ ఆధ్వర్యాన మోదీ చిత్రపటాలకు పాలాభిషేకాలు చేశారు. ఖమ్మం ముస్తఫానగర్ సెంటర్ వద్ద రాష్ట్ర బీజేపీ నాయకుడు డాక్టర్ శీలం పాపారావు మాట్లాడుతూ. రూ. 12 లక్షల లోపు పన్ను మినహాయింపు, రైతులకు పంట రుణాలు రూ. 3లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు పెంచడం, 60 ఏళ్లకు పైబడిన వారికి జీరో పన్ను మినహాయించిందన్నారు.