దేశంలో నిరుద్యోగ సమస్య లేకుండా ఏటా కోటి ఉద్యోగాలు ఇవ్వడంతో పాటు అన్ని రంగాల్లో అభివృద్ధిపై ఇచ్చిన హామీలను విస్మరించిన మోడీకి భారతరత్న అవార్డు ఇవ్వాలని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకులు డాక్టర్ కే. ఏ. పాల్ వ్యాఖ్యానించారు. ఖమ్మంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. డాక్టర్ బీ. ఆర్. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అవమానపరిచేలా కేంద్ర మంత్రులు వ్యవహరిస్తుండడం మంచి పద్దతి కాదన్నారు.