నాయీ బ్రాహ్మణ సేవా సంఘం నగర కమిటీ ప్రమాణ స్వీకారం మంగళవారం ఖమ్మం నగరంలోని ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. నగర అధ్యక్షుడిగా యలమందల జగదీష్, ప్రధాన కార్యదర్శిగా గుండ్లపల్లి శ్రీనివాసరావు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీ సమక్షంలో నాయీ బ్రాహ్మణుల సమస్యల కోసం ఓ టోల్ ఫ్రీ నంబర్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు చావా నారాయణరావు, శీలంశెట్టి వీరభద్రం, సంఘం బాధ్యులు ఉన్నారు.