ఖమ్మం జిల్లా కోర్టులో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. రాజగోపాల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు న్యాయ సేవా సదన్లో లోక్ అదాలత్ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. కేసుల పరిష్కారం కోసం పలు బెంచ్లను ఏర్పాటు చేయడమే కాక కక్షిదారులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.