పేద మహిళలను భాగస్వాములుగా చేస్తూ నూతన మహిళా సంఘాలను ఏర్పాటు చేయాలని మంత్రి ధనసరి సీతక్క సూచించారు. సీఎస్ కె. రామకృష్ణారావుతో కలిసి బడి బాట, ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాలపై ఆమె సోమవారం కలెక్టర్లతో వీడియో కాన్పరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ గత నవంబర్ లో శంకుస్థాపన చేసిన మహిళా శక్తి భవనాలు త్వరగా పూర్తయ్యేలా పంచాయతీరాజ్ శాఖ ఇంజనీర్లతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.