రవాణాశాఖ ఆధ్వర్యాన రోడ్డు భద్రతా మాసోత్సవాలు ప్రారంభమమయ్యాయి. ఈ సందర్భంగా ఖమ్మంలోని ఆర్టీఓ కార్యాలయంలో ఇన్చార్జ్ ఆర్టీఓ వి. వెంకటరమణ మాట్లాడుతూ ప్రాణం కంటే విలువైనదేది లేదని వాహనదారులు గుర్తించాలని, నిర్లక్ష్యంగా వాహనం నడిపి ప్రమాదాల బారిన పడితే కుటుంబాలకు తీరని నష్టం ఎదురవుతుందని చెప్పారు. ఈసందర్భంగా ట్రాఫిక్ నిబంధనలు, హెల్మెట్లు, సీట్ బెల్ట్ ఆవశ్యకతపై వాహనదారులకు అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు.