తెలుగు ప్రజల గుండెల్లో చిరస్మరణీయంగా నిలిచిపోయే మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఎన్టీఆర్ అభిమానుల ఆధ్వర్యాన ఖమ్మం లకారం ట్యాంక్ బండ్ పై ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకలను శనివారం నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి మాట్లాడారు. సినీ, రాజకీయ రంగాల్లో విశేష సేవలందించి తెలుగువారి కీర్తిని ప్రపంచ పటంలో నిలిపిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు.