ఖమ్మం: మున్నేరు లోతట్టు ప్రాంతాల పరిశీలన

0చూసినవారు
ఖమ్మం: మున్నేరు లోతట్టు ప్రాంతాల పరిశీలన
ఖమ్మం నగరం, రూరల్ మండలాల్లోని మున్నేటి లోతట్టు ప్రాంతాలను కలెక్టర్ అనుదీప్ పరిశీలించారు. కాల్వొడ్డు మున్నేరు బ్రిడ్జి, బొక్కలగడ్డ, వినాయక నిమజ్జన ఘాట్ ప్రాంతం, ప్రకాశ్ నగర్, జలగంనగర్ తదితర ప్రాంతాల్లో వివిధ శాఖల అధికారులతో కలిసి పర్యటించిన వారు వరద అంచనా, స్థానికుల అప్రమత్తతపై చర్చించారు. జిల్లా కేంద్రంలో 1077 నంబర్తో కంట్రోల్ రూమ్ ఏర్పాటైందనే విషయాన్ని స్థానికులకు అవగాహన కల్పించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్