ఖమ్మం నగరం 53వ డివిజన్ నరసింహస్వామి (గుట్ట) దేవాలయంలో శనివారం ఉదయం 11-00 గంటలకు ఘనంగా గోదా దేవికి ఒడిబియ్యం, సారె సమర్పించారు. శనివారం ఉదయాన్నే అత్యధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామివారికి, గోదాదేవికి మంగళప్రదమైన నీరాజనాలు సమర్పించి గోదాదేవిని కొలుస్తూ పాటలు పాడారు. తదనంతరం అమ్మవారికి చీరె, గాజులు, మరియు సౌభాగ్య ద్రవ్యములు సమర్పించి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అత్యధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.