తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతి, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఏప్రిల్, మే నెలల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు డీఈఓ సోమశేఖరశర్మ తెలిపారు. పదో తరగతి విద్యార్థులు థియరీ సబ్జెక్టుకు రూ. 100, ప్రాక్టికల్ సబ్జెక్టుకు రూ. 100, ఇంటర్ అభ్యర్థులు థియరీ సబ్జెక్టుకు రూ. 150, ప్రాక్టికల్ సబ్జెక్టుకు రూ. 150 చొప్పున పరీక్ష ఫీజు చెల్లించాలని సూచించారు.