కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ తక్షణమే ఆపాలని, మావోయిస్టులతో చర్చలు జరపాలని తెలంగాణ జన సమితి జిల్లా కన్వీనర్ వి. బాబు అన్నారు. బుధవారం ఖమ్మం నగరంలోని మయూరి సెంటర్లో తెజస జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్సీ కోదండరాం నాయకత్వంలో పార్టీ బలోపేతానికి నాయకులందరూ కలిసికట్టుగా పనిచేయాలని చెప్పారు. అలాగే ఇటీవల మరణించిన వీరజవాన్ మురళి నాయక్ కు సంతాపం తెలియజేశారు.