తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించే నూతన విత్తన చట్టం రైతుల రక్షణ పర్యావరణహితం ప్రధాన లక్ష్యంగా ఉండాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు అన్నారు ఖమ్మం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శనివారం రాష్ట్ర ముసాయిదా చట్టంపై అభిప్రాయ సేకరణ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ స్పీడ్ కార్పొరేషన్ చైర్మన్ అవినాష్ రెడ్డి, అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.