ఎస్సెస్సీ వార్షిక పరీక్షలు రాయనున్న విద్యార్థులు తత్కాల్ విధానంలో ఫీజు చెల్లించేందుకు ఈనెల 21వ తేదీ వరకు గడువు ఉందని ఖమ్మం డీఈఓ ఈ. సోమశేఖర శర్మ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు రూ. వెయ్యి అపరాధ రుసుంతో ఫీజు చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించారు. ఈ విషయాన్ని విద్యార్థులు గమనించి సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.