ఖమ్మం: అర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి

55చూసినవారు
ఖమ్మం: అర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి
ప్రజావాణి (గ్రీవెన్స్ డే)లో అందే అర్జీలను ఎప్పటికప్పుడు పరిశీలించి సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ ఆదేశించారు. ఖమ్మం కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ఆమె డీఆర్వో ఏ. పద్మజ, డీఆర్డీవో సన్యాసయ్యతో కలిసి ఆమె దరఖాస్తులు, వినతులు స్వీకరించారు. అధికారులతో సమావేశమైన అదనపు కలెక్టర్ పరిష్కారంపై సూచనలు చేశారు. కార్యక్రమంలో కలెక్టరేట్ ఏఓ అరుణ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్