కేజీబీవీ పాఠశాల్లో విద్యా బోధన కరువైందని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి టి. ప్రవీణ్ ఆరోపించారు. ఖమ్మం నగరంలోని సుందరయ్య భవనంలో నగర నాయకుడు వినోద్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి వీడి ఎస్ఎస్ఏ ఉద్యోగులతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. గత 25 రోజులుగా వారు సమ్మె చేస్తున్న ప్రభుత్వం స్పందించకపోవడంతో పాఠశాలల్లో విద్యా కుటుంపడుతుందన్నారు.