ఖమ్మం: ప్రొబెషనరీ ఎస్సైలకు పోస్టింగ్

81చూసినవారు
ఖమ్మం: ప్రొబెషనరీ ఎస్సైలకు పోస్టింగ్
ఖమ్మం పోలీస్ కమిషనరేట్ కు కేటాయించిన తొమ్మిది మంది ప్రొబెషనరీ ఎస్సైలకు వివిధ స్టేషన్లలో పోస్టింగ్ ఇచ్చారు. ఐదు నెలల శిక్షణలో భాగంగా వీరిని పోలీస్ స్టేషన్లకు కేటాయిస్తూ సీపీ సునీల్ దత్ ఉత్తర్వులు జారీచేశారు. ఇటీవల ట్రైనీ ఎస్ఐలుగా శిక్షణ పూర్తి చేసుకొని ఖమ్మం పోలీస్ కమిషనరేట్ కు రిపోర్ట్ చేశారు. ఈ సందర్భంగా వారికి సిపీ శుభాకాంక్షలు తెలిపారు. అప్పగించిన శాఖాపరమైన బాధ్యతలు సక్రమంగా నిర్వహించాలన్నారు.

సంబంధిత పోస్ట్