ఖమ్మం నగరంలోని రామాలయం సబ్ స్టేషన్ పరిధి రామాలయం ఫీడర్లో మరమ్మతు పనుల కారణంగా ఆదివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని సెక్షన్-5 ఏఈ ఒక ప్రకటనలో తెలిపారు. దీంతో రామాలయం, రిక్కా బజార్ తదితర ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఉంటుందని, వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని ఏఈ కోరారు.