ఖమ్మం నగరంలోని 11 కేవీ బస్టాండ్ ఫీడర్ పరిధిలో విద్యుత్ లైన్లకు ఆటంకంగా ఉన్న చెట్ల కొమ్మల తొలగింపు కారణంగా శనివారం ఉదయం 9: 30 నుంచి 11 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని టౌన్-2 ఏఏఈ బి. రవికుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. దీంతో బస్ డిపో రోడ్డు, భక్త రామదాసు కళాక్షేత్రం, పెవిలియన్ గ్రౌండ్, మయూరిసెంటర్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందన్నారు. వినియోగదారులు గమనించి సహకరించాలని కోరారు.