ఖమ్మం నగరంలోని గాంధీచౌక్ సబ్ స్టేషన్ 11 కేవీ గుట్టల బజార్ ఫీడర్ పరిధిలో విద్యుత్ లైన్లకు ఆటంకంగా ఉన్న చెట్ల కొమ్మల తొలగింపు కారణంగా ఆదివారం ఉదయం 9 నుంచి 11 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని ఏఈ క్రాంతి సింహ ఒక ప్రకటనలో తెలిపారు. దీంతో గాంధీచౌక్, రైల్వే స్టేషన్ రోడ్, సుందర్ టాకీస్ రోడ్, మోహన్ రోడ్, వాసవీ నగర్, జహీర్ పురతండా, కిన్నెరసాని డౌన్ తదితర ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఉంటుందన్నారు.