కేంద్రం గుడ్న్యూస్.. భారీగా నిధులు విడుదల
దేశంలోని వివిధ రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పన్నుల్లో వాటా కింద శుక్రవారం రాష్ట్రాలకు రూ.1,73,030 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో ఏపీకి రూ.7002 కోట్లు, తెలంగాణకు రూ.3,637 కోట్లు రిలీజ్ చేసింది. మూలధన వ్యయం, అభివృద్ధి, సంక్షేమానికి నిధులు కేటాయిస్తున్నట్లు పేర్కొంది. ఏపీకి అధిక నిధులు కేటాయించి.. అందులో సగం కూడా తెలంగాణకు కేటాయించకపోవడంపై తెలంగాణ ప్రభుత్వం అసహనంగా ఉన్నట్లు తెలుస్తోంది.