
భారీగా తగ్గిన బంగారం ధరలు
గత నాలుగు రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు.. శుక్రవారం భారీగా తగ్గాయి. బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.1,150 తగ్గి రూ.90,150కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై రూ.1,250 తగ్గి రూ.98,350 వద్ద ధర కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.1,11,100గా ఉంది. తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన నగరాలలో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.