ఖమ్మం: 1, 2న ప్రజా విజయోత్సవ సాంస్కృతిక కార్యక్రమాలు

80చూసినవారు
ఖమ్మం: 1, 2న ప్రజా విజయోత్సవ సాంస్కృతిక కార్యక్రమాలు
డిసెంబర్ 1, 2న రెండు రోజుల పాటు ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఓ ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా డిసెంబర్ 1న ఖమ్మం రూరల్ మండలం నాయుడుపేట చౌరస్తా వద్ద గల టీవీసీ రెడ్డి ఫంక్షన్ హాల్లో, డిసెంబర్ 2న మధిరలోని రెడ్డి ఫంక్షన్ హాలులో కళా ప్రదర్శనలు చేయడం జరుగుతుందని చెప్పారు. ప్రజలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్