ఖమ్మం: ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య

60చూసినవారు
ఖమ్మం: ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య
ప్రైవేట్ విద్యాసంస్థలతో పోలిస్తే ప్రభుత్వ పాఠశాలల్లో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ఉన్నందున నాణ్యమైన విద్య అందుతుందని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. రఘునాథపాలెం మండలం పువ్వాడనగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన మండల ప్రాథమిక పాఠశాలను గురువారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వ స్కూళ్లలో అన్ని వసతులు ఉండడమే కాక ఉపాధ్యాయుల కృషితో 10వ తరగతి విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించారని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్