రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర మంగళవారం ప్రముఖ సాహితీవేత్త, నంది అవార్డు గ్రహీత బుక్క సత్యనారాయణను ఖమ్మంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో పూలమాల వేసి శాలువాతో సత్కరించారు. ప్రముఖ ఆల్ ది బెస్ట్ ఆర్ట్స్ అకాడమీ సంస్థ 20వ వార్షికోత్సవంలో సత్యనారాయణ వేరువేరు విభాగాల్లో మూడు విశిష్ట పురస్కారాలు అందుకోవడం హర్షనీయమని అన్నారు. మున్ముందు మరిన్ని పురస్కారాలు, అవార్డులు అందుకోవాలని ఎంపీ ఆకాంక్షించారు.