ఖమ్మం మమతా రోడ్డులో నిర్వహిస్తున్న సహస్ర చండీయాగంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర గురువారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా యాగం నిర్వహణకు ఆయన రూ. 3లక్షల విరాళం అందజేశారు. తన గోత్ర నామాలతో ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితుల ఆశీర్వచనాలు, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. లోక కల్యాణం కోసం యాగం నిర్వహిస్తుండడం అభినందనీయమని కొనియాడారు. నిర్వాహకులు భాను రవికిరణ్, దండ్యాల లక్ష్మణావు, గుర్రం మురళి దంపతులు పాల్గొన్నారు.