ఖమ్మం: అధికార లాంఛనాలతో ముగిసిన రామయ్య అంత్యక్రియలు

69చూసినవారు
కోటికి పైగా మొక్కలకు ప్రాణదాతగా నిలిచిన పర్యావరణ ప్రేమికుడు, పద్మశ్రీ వనజీవి రామయ్యకు పలువురు కన్నీటితో వీడ్కోలు పలికారు. ఆదివారం రామయ్య అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహించారు. ఆటవీ, రెవెన్యూ శాఖల అధికారులు, మున్సిపల్ అధికారులు ఏర్పాట్లను పరిశీలించారు. తహసీల్దార్ పి. రాంప్రసాద్, మున్సిపల్ కమిషనర్ ఆళ్ల శ్రీనివాసరెడ్డి పాడె మోశారు. పలువురు అధికారులు రామయ్యకు వందనం చేసి కడసారి వీడ్కోలు పలికారు.

సంబంధిత పోస్ట్