డివిజన్ల వారీగా చెత్త వేసే స్థలాలను శుభ్రం చేసి మొక్కలు నాటాలని కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య తెలిపారు. బుధవారం శానిటరీ సూపర్వైజర్లు, శానిటరీ ఇన్ స్పేక్టర్ లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వచ్చేనెల ఒకటి నుంచి 9 వరకు ప్రజాపాలన విజయోత్సవాల సందర్భంగా నగరంలోని 60 డివిజన్ లోనూ శుభ్రం చేసేలా ప్రణాళిక సిద్ధం చేసుకుని స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ ఏర్పాటు చేసుకోవాలన్నారు.