ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యలు పరిష్కరించాలని, ప్రైవేట్, కార్పొరేటు విద్యాసంస్థల్లో ఫీజుల దోపిడి అరికట్టాలని, నిబంధనలు పాటించని విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని జార్జిరెడ్డి PDSU జిల్లా అధ్యక్షుడు మందా సురేష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఖమ్మం డీఈఓ సూపరిండెంట్ కి వినతిపత్రం అందజేశారు. పాఠశాలలు ప్రారంభమైన రెండు రోజుల్లో అన్ని సబ్జెక్ట్ ల పాఠ్యపుస్తకాలు విద్యార్థులకు ఇవ్వాలని కోరారు.