ఖమ్మం: పారిశుద్ధ్య సమస్యలను పరిష్కరించాలని వినతి

80చూసినవారు
ఖమ్మం: పారిశుద్ధ్య సమస్యలను పరిష్కరించాలని వినతి
ఖమ్మం 21వ డివిజన్‌లో నెలకొన్న పారిశుద్ధ్య సమస్యలను పరిష్కరించాలని బీఆర్ఎస్ డివిజన్ ఇన్‌చార్జ్ ఉస్మాన్ కోరారు. సోమవారం ఖమ్మం KMCలో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ శ్రీజకు వినతిపత్రం అందించారు. డ్రైనేజీ కాలువల్లో పేరుకుపోయిన చెత్త, మట్టిని తొలగించకపోవడంతో దోమలు పెరిగి డెంగ్యూ, మలేరియా వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయని చెప్పారు. సమస్యను త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్