
వారికి కుటుంబ ప్రయోజనాలే ముఖ్యం: మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ఉత్తరప్రదేశ్లోని తనసొంత నియోజకవర్గం వారణాసిలో పర్యటించారు. రూ.3,880కోట్ల విలువైన 44 గ్రామీణాభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అధికారాన్ని కోరుకునేవారు వారి సొంత కుటుంబాల ప్రయోజనాల కోసమే పనిచేస్తారన్నారు. కొంతమంది అధికార దాహంతో రాత్రి, పగలు రాజకీయ ఆటలు ఆడుతున్నారంటూ విమర్శించారు. కానీ బీజేపీ మాత్రం సమ్మిళిత అభివృద్ధి కోసమే పనిచేస్తోందని పేర్కొన్నారు.