ఖమ్మం: వీధి కుక్కలతో సతమతమౌతున్న బ్రాహ్మణ బజారు వాసులు

57చూసినవారు
ఖమ్మం: వీధి కుక్కలతో సతమతమౌతున్న బ్రాహ్మణ బజారు వాసులు
ఖమ్మం నగరం 26వ డివిజన్ పరిధిలోని బ్రాహ్మణ బజారులో, రామాలయం వీధిలో గురువారం వీధి కుక్కలు హల్ చల్ చేశాయి. తెల్లవారు ఝామున వెళుతున్న పాదచారుల వెంట, ద్విచక్ర వాహన దారుల వెంట పడి తరుముతున్నాయి.
రామాలయం వీధిలో గల ఒక ఖాళీ స్థలంలో కనీసం 10 నుండి 15 కుక్కల వరకు చిన్న కుక్కలతో నివసిస్తూ రాత్రిపూట వాటి అరుపులతో ఆ ప్రాంతమంతా భయానకంగా మారింది. ఇప్పటికైనా ఈ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేయాలని స్థానికులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్