ఖమ్మం నగరం 26 వ డివిజన్ రామాలయం వీధి బ్రాహ్మణ బజారు నుండి ఆదివారం గన్నవరం విమానాశ్రయం దగ్గర గల కేసరపల్లిలో జరుగుతున్న హైందవ శంఖారావానికి ఖమ్మం నగరవాసులు ఆదివారం తెల్లవారుజామున బయలుదేరి వెళ్ళారు.
దేవాలయాల స్వయం ప్రతిపత్తి మరియు రక్షణకోసం లక్షలాదిగా హిందూ బంధువులు హైందవ శంఖారావానికి బయలుదేరి వెళ్లిన తరుణంలో ఖమ్మం నగరవాసులైన మార్తి వీరభదప్రసాదశర్మ, గుర్రాల నాగేంద్రరావు, తదితరులు కేసరపల్లికి వెళ్ళారు.