రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందిన ఘటన నేలకొండపల్లి మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. నేలకొండపల్లి మండల కేంద్రంలోని డిగ్రీ కళాశాల సమీపంలో హైవేపై ఆగి ఉన్న ట్రాక్టర్ ట్రాలీని బైక్ ఢీకొనడంతో బైక్‌పై ఉన్న యువకుడు మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.