ఖమ్మం కాల్వొడ్డు వద్ద గల మున్నేరు పాత వంతెన కింద ఉన్న చప్టాపై రాకపోకలు సాగించేందుకు అర్అండ్ బీ అధికారులు బీటీ రోడ్డు నిర్మించారు. ఒకవైపు తారు రోడ్డు వేయగా, మరోవైపు ఒకటి రెండు రోజుల్లో తారు వేసి రాకపోకలు సాగించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. తారు వేసిన తర్వాత పూర్తిస్థాయిలో వాహనాల రాకపోకలు అనుమతిస్తామని ఈఈ యుగంధర్ తెలిపారు. కాగా, మున్నేరుపై కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణం కోసం పనులు చకచక సాగుతున్నాయి.