ఖమ్మం జిల్లా, కామేపల్లి మండలం మర్రిగూడెం సమీపంలో ఆర్టీసీ బస్సు, సిమెంట్ యాష్ లారీ ఢీకొనడంతో ఇరువురు డ్రైవర్లకు తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ఖమ్మం వైద్యశాలకు తరలించారు. ఇల్లందు మీదుగా కోదాడ వెళుతున్న లారీ, ఖమ్మం నుండి ఇల్లందు వస్తున్న ఆర్టీసీ బస్.. లారీ ముందు ఉన్న వాహనాన్ని ఓవర్ టెక్ చేయబోయి ఆర్టీసీ బస్ ను ఢీ కొట్టాడు. లారీ డ్రైవర్, బస్ డ్రైవర్ లు ఇద్దరు క్యాబిన్ లో ఇరుక్కున్నారు. అతికష్టం మీద డ్రైవర్ల ను బయటకు తీసి చికిత్స నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.