పండుగ పూట తమ పిల్లల కోసం తల్లిదండ్రులు పడిగాపులు కాస్తూ నిరాశతో వెనుదిరిగిన ఘటన గురువారం ఖమ్మం రూరల్ మండలం కోదాడ క్రాస్ రోడ్ వద్ద ఉన్న సాంఘిక సంక్షేమ బాలికల వసతిగృహం వద్ద చోటు చేసుకుంది. తమ పిల్లలను చూసేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన తల్లిదండ్రులను సిబ్బంది అనుమతించలేదు. చాలా దూరం నుంచి వచ్చామని, లోపలికి అనుమతించాలని సిబ్బందిని కోరినా, అనుమతించకపోవడంతో ఎండలో పడిగాపులు కాసి నిరాశతో వెనుదిరిగారు.