ఖమ్మం: రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా నగదు జమ

80చూసినవారు
ఖమ్మం: రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా నగదు జమ
తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా నిధులను విడుదల చేసింది. మండలాల్లో గ్రామాల వారీగా నగదు జమ జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఒక ఎకరం వరకు సాగులో ఉన్న భూములకు లబ్ధిదారుల ఖాతాలో నగదు జమ చేసింది. ఖమ్మం జిల్లాలో ఎకరంలోపు భూమి ఉన్న రైతులు 1,04,995 మంది ఖాతాలలో రూ.58, 22,56,809 కోట్లు గురువారం జమ అయ్యాయి. గతంలో రైతులకు పెట్టుబడి సాయం కింద ఎకరాకు రూ. 5 వేల చొప్పున అందించేవారు. దీనిని రూ.6 వేలకు పెంచిన విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్