ఖమ్మం: గిరిజనులకు చేసిన సేవలు మరువలేనివి

ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేసిన ప్రజానేత, మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ అని TGTTF రాష్ట్ర అధ్యక్షుడు ఇస్లావత్ లక్ష్మణ్ నాయక్ అన్నారు. శనివారం ఖమ్మం జడ్పీ సమావేశ మందిరంలో LPHS రాష్ట్ర ఉపాధ్యక్షులు భద్రు నాయక్ ఆధ్వర్యంలో మదన్ లాల్ సంస్మరణ సభ నిర్వహించారు. గిరిజనులకు ఆయన అందించిన సేవలు మరువలేనివని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ DCCB చైర్మన్ కూరకాల నాగభూషణం, తదితరులు ఉన్నారు.