ఆర్టీసీ ఖమ్మం డిపోలో పెంటయ్య అనే డ్రైవరు అయ్యప్ప మాల వేశారు. విధి నిర్వహణకు వచ్చిన ఆ స్వామికి బుధవారం బ్రీత్ అనలైజర్ టెస్ట్ సెక్యూరిటీ సిబ్బంది చేశారు. అయ్యప్ప స్వామిని మద్యం సేవించారనే ఉద్దేశంతో బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయడం మత విశ్వాసాలను అపహాస్యం చేయడమే కాకుండా హిందూ ధర్మాన్ని అవమానించారని ఆవేదన వ్యక్తం చేస్తూ విధులకు వెళ్లారు. ఇంకోసారి ఇలాంటి విషయాలు జరగకుండా చూసుకుంటామని డిపో మేనేజర్ హామీ ఇచ్చారు.