ఖమ్మం: ఎస్ఎస్ఏ ఉద్యోగులకు సంఘీభావం

67చూసినవారు
సమగ్ర శిక్షా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం స్టీరింగ్ కమిటీ చైర్మన్ కే. వీ. కృష్ణారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం ఖమ్మం కొత్త కలెక్టరేట్ ధర్నాచౌక్ శిబిరాన్ని సందర్శించి తమ సంఘీభావం తెలిపారు. గతంలో ట్రైబల్ వెల్ఫేర్ వారు 20 రోజులు సమ్మె చేస్తే మంత్రి సీతక్క క్రమబద్ధీకరణ చేయించారని, సమగ్ర శిక్షా ఉద్యోగులకు ఇచ్చిన హామీ నెరవేర్చమంటే ఎందుకు నెరవేర్చట్లేదని ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్