ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ప్రతీ శుక్రవారం వృద్ధులకు ప్రత్యేక ఔట్ పేషంట్ సేవలు అందుబాటులోకి తేనున్నారు. పెద్దాస్పత్రికి రోగుల తాకిడి పెరగడంతో ఓపీ కోసం వారి పడుతున్న ఇబ్బందులను తగ్గించేందుకు ఈ చర్యలు తీసుకున్నారు. ఉమ్మడి జిల్లాల నుంచి వచ్చే వృద్ధులు వైద్యుల రూం వద్ద కూడా గంటల తరబడి నిల్చోవాల్సి వస్తోంది. దీంతో వృద్ధులకు వారంలో ఒక రోజు ప్రత్యేక ఓపీ ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.