ఖమ్మం నగరపాలక సంస్థ పరిధిలోని వివిధ డివిజన్లో అర్ధరాత్రి గాలివాన బీభత్సానికి రోడ్డుపై చెట్లకొమ్మలు ఒరిగాయి. ఈక్రమంలో బుధవారం డీఆర్ఎఫ్ సిబ్బంది ప్రమాదకరంగా ఉన్న చెట్లను, కొమ్మలను తొలగించి రోడ్డు మీద వచ్చి పోయేవారికి ఇబ్బంది లేకుండా క్లియర్ చేశారు. అంతేకాక, నగరంలోని పలు డివిజన్లలో రాత్రి కురిసిన గాలివానకి కొమ్మలు విరిగి ప్రమాదకరంగా వేలాడుతున్న వాటిని కూడా సిబ్బంది తొలగించి రహదారులను క్లియర్ చేశారు.