
జగన్ హెలిప్యాడ్ ఘటన.. విచారణకు హాజరైన పైలట్, కో-పైలట్
AP: ఈ నెల 8న శ్రీసత్యసాయి జిల్లా రామగిరి మండలం పాపిరెడ్డిలో జగన్ పర్యటన సందర్భంగా హెలిప్యాడ్ వద్ద జరిగిన ఘటనపై పోలీసుల విచారణకు పైలట్, కో-పైలట్ హాజరయ్యారు. ఆ పర్యటనకు జగన్ చిప్సాన్ ఏవియేషన్‌కు చెందిన హెలికాప్టర్‌ను వినియోగించారు. పైలట్ అనిల్ కుమార్, కో-పైలట్ శ్రేయజ్ జైన్‌ను చెన్నేకొత్తపల్లి సీఐ కార్యాలయంలో పోలీసులు విచారిస్తున్నారు.