ఖమ్మం జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆదివారం రాత్రి ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వాన కురిసింది. పగలంతా ఎండ తీవ్రత, ఉక్కపోత వాతావరణం ఉండగా సాయంత్రానికి మార్పు చోటు చేసుకుంది. ఖమ్మం నగరంతో పాటు పలు ప్రాంతాల్లో వడగళ్లతో కూడిన వర్షం కురిసింది. ఈదురుగాలులు, వడగళ్ల వానతో జిల్లాలోని అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడి వినియోగదారులు ఇబ్బంది పడ్డారు.