ఖమ్మం జిల్లా బాల భవన్ లో అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్ వారు వరకు ఒకటవ తరగతి నుండి 9వ తరగతి చదివే దాదాపు 60 మంది విద్యార్థినీ విద్యార్థులకు వేసవి శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ వేసవి శిక్షణా తరగతులలో విద్యార్థులకు చిన్నతనం నుండే ఇంజనీరింగ్ బేస్ లర్నింగ్ పై అంటే వంతెనలు ఎలా కట్టాలి, వివిధ రకాల కుర్చీలు ఎలా తయారు చేయాలి వీటితోపాటు ఆర్ట్ మరియు క్రాఫ్ట్ పై కూడా శిక్షణ ఇచ్చి వారికి అవగాహన కల్పించారు.